Actor Ali Meets Minister Seethakka | మంత్రి సీతక్క ( Minister Seethakka )ను నటుడు అలీ కలిశారు. శనివారం సచివాలయంలో మంత్రి పేషీలో సీతక్కతో అలీ, డైరెక్టర్ రమణారెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
సామాజిక బాధ్యతతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా అలీ ‘నిన్ను నన్ను కన్నది ఆడది రా’ అనే పాటను చిత్రీకరించారు. మంత్రితో భేటీ సందర్భంగా ఈ పాటను సీతక్కకు చూపించారు.
అలాగే పాట ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కాగా ప్రసాద్ ల్యాబ్స్ ( Prasad Labs ) లో జనవరి 8 సాయంత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.