Aamir Khan Charged Zero Fee For ‘Coolie’ | సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజన్ తెరకెక్కించిన ‘కూలీ’ సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే.
తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాలో నటించిన ఆమిర్ ఖాన్ పారితోషకంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. తాజగా వీటికి చెక్ పెట్టారు ఆమిర్ ఖాన్. రజినీకాంత్ తో పాటు కూలీలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర మరియు ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు నటించారు.
ఈ క్రమంలో ‘కూలీ’ సినిమా కోసం ఆమిర్ ఖాన్ ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని వెల్లడించారు.
రజినీకాంత్ తో పాటు కలిసి నటించడమే పెద్ద పారితోషకం అని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపించినట్లు చెప్పారు. కూలీలో అసలైన హీరోలు రజినీకాంత్ మరియు నాగార్జునే అని ఆమిర్ అన్నారు. వీరిని చూసేందుకే అభిమానులు థియేటర్లకు వస్తున్నారని తెలిపారు.









