SIT Issues Notice to KCR in Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి గురువారం మధ్యాహ్నం బీఆరెస్ అధినేత కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. గురువారం జూబ్లీహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ సమయంలో బీఆరెస్ అధినేత ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు.
ఇకపోతే 65 ఏళ్ళు పైబడిన నేపథ్యంలో కేసీఆర్ పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. హైదరాబాద్ పరిధిలో ఏదైనా ప్రాంతం వివరాలను తెలపాలని కోరారు. ఒకవేళ కేసీఆర్ పోలీసు స్టేషన్ కు వస్తామన్నా రావొచ్చన్ని చెప్పారు. CRPC 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ మరియు సంతోష్ రావును విచారించిన విషయం తెల్సిందే.









