Kalvakuntla Kavitha News | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా, బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. బుధవారం జరిగిన ఈ చర్చల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కవిత సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.









