A kindhearted e-rickshaw driver helped a poor couple late at night by offering them a free ride | ఈ ఆటో డ్రైవర్ చూపిన గొప్ప మనసు ఇప్పుడు నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. అర్థరాత్రి, చేతిలో చిల్లిగవ్వా లేదు. ఇల్లు చాలా దూరంలో ఉంది. ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆందోళన పడుతున్న ఓ పేద దంపతులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు ఆటో డ్రైవర్. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భర్త రోడ్డుపై ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించి అమ్ముతాడు, మరోవైపు భార్య భిక్షాటన చేస్తుంది.
అయితే అర్థరాత్రి వేళ వారు ఇంటికి వెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇదే సమయంలో ఓ ఆటో డ్రైవర్ వారి వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు. గంగాపూర్ వెళ్ళాలి అని చెప్పగా ఆటోలో కూర్చోమన్నారు. అయితే తమ వద్ద డబ్బులు లేవని చెప్పగానే ఆటో డ్రైవర్ ఏ మాత్రం సంకోచించకుండా మీ దగ్గర డబ్బులు తీసుకుని నేను ఏం చేస్తా అంటూ ఆటో ఎక్కమని చెప్పాడు. దింతో దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆటోలో ఇంటికి చేరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్ గొప్ప మనసు పట్ల నెటిజన్లు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.









