KTR Comments | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Sessions) సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోమవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై చర్చించారు.
జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ విభజన మొత్తం డబ్బుల కోసమేనని, అడ్డగోలుగా విభజన చేశారని విమర్శించారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా తమ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, గతంలో తాము గెలిచిన సీట్లను భవిష్యత్తులో ఎవ్వరూ గెలవలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీసాలు, గడ్డాలు పెంచడంపైనా సెటైర్లు వేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు.. గడ్డాలు పెంచడం చాలా ఈజీ… పాలన చేయడమే కష్టం.
గడ్డం, మీసాలు లేవని రేవంత్ రెడ్డి అన్నది తానను కాదనీ, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని అన్నారని ఎద్దేవా చేశారు. తాను ఆంధ్రలో చదివితే తప్పు.. కానీ రేవంత్ తన అల్లుడిని ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని గుర్తు చేశారు.









