Ys Jagan News | ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. ‘చంద్రబాబుగారూ…మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది’ అంటూ జగన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
కూటమి సర్కారు వచ్చిన 18 నెలల కాలంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఒక్క సెంటు భూమిని కూడా సేకరించలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కానీ వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాలను, నిర్మాణంలో ఉన్న ఇళ్లను తామే కట్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం సిగ్గుపడకుండా క్రెడిట్ కోసం చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ కన్నెర్ర చేశారు.
ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అవుతాడు అని ఫైర్ అయ్యారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో, పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు క్రెడిట్ చోరీలో చంద్రబాబుకు మరొకరు సాటి లేరన్నారు.









