Varun Tej Becomes Father | మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు ఎంటరయ్యాడు. టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. బుధవారం హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి మగ బిడ్డకు జన్మనిచ్చారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు చిరంజీవి కూడా తన కొత్త సినిమా ‘మన శంకరవరప్రసాద్’ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి ఆ బిడ్డను ఎత్తుకుని మురిసిపోతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
2017లో ‘మిస్టర్’ సినిమా కోసం వరుణ్ – లావణ్య తొలిసారి కలిసి నటించారు. అప్పుడే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. 2023 నవంబర్ 1న ఇటలీలోని టస్కానీ వేదికగా వీరు పెళ్లి చేసుకున్నారు.









