Director Sukumar About Pushpa-3 | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాసింది.
ఇప్పుడు ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ పై కీలక ప్రకటన చేశారు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ‘పుష్ప’ అటు కలెక్షన్ల తో పాటు అవార్డులను సైతం సొంతం చేసుకుంటుంది. పుష్ప సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకున్న విషయం తెల్సిందే.
తాజగా దుబాయ్ వేదికగా జరిగిన ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ లో సైతం పుష్ప-2 అత్యధిక విభాగాల్లో నామినేషన్లను దక్కించుకుంది. అలాగే ఐదు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మీక, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు అవార్డులను గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ పుష్ప-3 కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా పుష్ప-3 ర్యాంపేజ్ కు సంబంధించి గతంలోనే ఒక పోస్టర్ విడుదల అయిన విషయం తెల్సిందే.









