Manoj Manchu In A Historical Film David Reddy | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సరికొత్త సినిమాతో రాబోతున్నారు. తాను తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 21 ఏళ్ళు పూర్తి అయ్యాయని మనోజ్ వెల్లడించారు.
ఇన్ని సంవత్సరాల పాటు తనకు అండగా నిలిచిన అభిమానులకు, ప్రేక్షకులకు మనోజ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తన 21వ సినిమాను ప్రకటించారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాలో నటించబోతున్నట్లు ప్రకటించారు.
1897 నుంచి 1922 మధ్య బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి కథతో మనోజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ గా ఇది తెరకెక్కనుంది. తాను ఇప్పటికీ తనకిష్టమైన పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.









