Noida Boy Becomes World’s Richest In A Day | ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 ఏళ్ల ఓ కుర్రాడు రాత్రికి రాత్రే అంబానీ, ఆదానిలను దాటేసి రూ.కోటి కోట్లకు అధిపతిగా మారాడు.
దీనికి కారణం అతడి బ్యాంకు ఖాతాలో రూ.కోటి 13 లక్షల 56 వేల కోట్లు జమ అయ్యాయి. యూపీలోని నోయిడా కు చెందిన దీపక్ వయసు 20 ఏళ్ళు. రెండు నెలల క్రితం అతడి తల్లి గాయత్రి దేవి మరణించారు. ఈ క్రమంలో తల్లికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంకు ఖాతాను దీపక్ వాడుతున్నాడు.
ఆగస్ట్ 3 రాత్రి అతడి బ్యాంకు ఖాతాలో ఇలా రూ.కోటి కోట్లకు పైగా డబ్బు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఉదయాన్నే మెసేజిని చూసిన దీపక్ ఆశ్చర్యపోయాడు. స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పి, ఖాతాలో జమ అయిన డబ్బులకు సంబంధించిన అంకెలను లెక్కపెట్టాలని చెప్పారు.
36 అంకెల డబ్బు ఖాతాలో జమ అవ్వడం చూసి అందరూ షాక్ అయ్యారు. అనంతరం దీపక్ బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది సైతం ఖాతాలోని డబ్బులను చూసి అవాక్కయ్యారు. ఆ వెంటనే ఖాతాను ఫ్రీజ్ చేశారు. టెక్నికల్ ఎర్రర్ మూలంగా ఇలా జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అని కోణంలో ఆరా తీస్తున్నారు.









