Free bus travel for women across Andhra Pradesh from August 15 | ఆంధ్రప్రదేశ్ లో ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఆగస్ట్ 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.
ఈ మేరకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పథకం యొక్క హైలైట్స్ ను వివరించారు. ‘స్త్రీ శక్తి’ పేరుతో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సీటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందన్నారు. 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉచిత ప్రయాణం కోసం ఏడాదికి రూ.1,950 కోట్ల వ్యయం అవుతుందని తెలిపారు.
మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు ఏదో ఒకటి చూపించాలని వివరించారు. రానున్న రెండేళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.









