Team India script a historic win to square series | టీం ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ నిప్పులుచెరిగే బంతులతో ఇంగ్లాండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించాడు. దింతో అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగ జరిగిన ఐదవ టెస్టులో భారత్ అనూహ్య విజయాన్ని కైవసం చేసుకుంది.
ట్రోఫీలో భాగంగ ఇంగ్లాండ్ రెండు, భారత్ రెండు విజయాలను సాధించగా ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆరు వికెట్లు కోల్పోయి 339 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 367 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది.
చివరి రోజు ఆది నుంచి బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ వేశారు. జేమి స్మిత్, ఓవర్టన్, జోష్ టంగ్ లు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. కాసేపు పోరాడిన అట్కిన్సన్ ను సిరాజ్ చివరి వికెట్ గా ఔట్ చేశాడు.
ఐదవ రోజు ఆటలో సిరాజ్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఐదవ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్ లో సిరాజ్ ఐదు వికెట్లను తీశాడు. సిరాజ్ కు తోడుగా ప్రసిద్ కృష్ణ సైతం నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆకాష్ దీప్ ఒక వికెట్ తీశాడు.









