Upasana Konidela Thanks Cm Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉపాసన కొణిదెల కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025’ ను ఆవిష్కరించిన విషయం తెల్సిందే.
ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా దీనిని రూపొందించినట్లు సీఎం పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో క్రీడా రంగాన్ని తీర్చిదిద్ది, ప్రపంచ శక్తిగా మార్చలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను రూపొందించింది.
ఈ సంస్థకు ఛైర్మన్ గా పారిశ్రామికవేత్త, ఐపీఎల్ జట్టు లక్నో సూపర్ జయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాను నియమించింది. అలాగే ఉపాసనను కో-ఛైర్మన్ గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉపాసన స్పందించారు.
తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ శక్తిగా రూపొందించడానికి సంజీవ్ గోయెంకాతో కలిసి కో-ఛైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలను (PPP) నిర్మించడానికి మరియు రాష్ట్రంలో భవిష్యత్తు కోసం క్రీడా వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు అనే ఉపాసన అభిప్రాయం వ్యక్తం చేశారు.









