Saina Nehwal Shares Pic With Parupalli Kashyap Weeks After Separation | తన భర్త పారుపల్లి కశ్యప్ తో విడిపోతున్నట్లు భారత బ్యాట్మెంటన్ స్టార్ సైనా నెహ్వాల్ రెండు వారాల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే.
అయితే తాజాగా ఆమె మనసు మార్చుకున్నారు. భర్తతో తిరిగి కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నట్లు అర్ధం వచ్చేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో భర్తతో కలిసి ఉన్న ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. తాము మళ్లీ తిరిగి కలిసి ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
దూరంగా ఉంటే బంధం విలువ ఏంటో తెలుస్తుందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కశ్యప్, సైనా నెహ్వాల్ జంట సంతోషంగా జీవుతాన్ని కొనసాగించాలని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా 2018లో ఈ జంటకు వివాహం జరిగింది.









