Ys Jagan News | ముఖ్యమంత్రి చంద్రబాబు పై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత జగన్. ఎన్నికలకు ముందు అధికారం కోసం హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు, తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారని చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
ఇది ఇవాళ మరోసారి నిజమైందని పేర్కొన్నారు. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు చంద్రబాబు యొక్క వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని చంద్రబాబు మంటగలిపారని నిలదీశారు.
ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు అని తెలిపారు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదన్నారు.
ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారని ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు.









