Bhagavanth Kesari bags National Award | 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది.
ఇందులో నందమూరి బాలకృష్ణ-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికయ్యింది. ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్’ నిలిచింది. 2023లో విడుదల అయిన వందలాది సినిమాల నుంచి అందిన నామినేషన్లను జ్యూరీ సభ్యులు పరిశీలించారు.
అనంతరం విజేతలను ఎంపిక చేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతలు వివరాలను వెల్లడించారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ అవార్డు బాలయ్య సినిమాకు దక్కడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెల్సిందే.









