Election Commission announces date for Vice President’s poll | ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుందని స్పష్టం చేసింది. జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యం అయిన విషయం తెల్సిందే. ఆగస్ట్ 7న ఎన్నికల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్ట్ 21 చివరి తేది.
ఎన్నికలు సెప్టెంబర్ 9న జరగనున్నాయి. ఇదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన తొలి రోజు చురుకుగానే ఉన్న జగదీప్ ధన్ ఖడ్, రాత్రి అనారోగ్య కారణాల కారణంగా రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖను పంపారు.
ఇదిలా ఉండగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ఎవరిని ఎంపిక చేయనుంది అనేది ఆసక్తిగా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్ మరియు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మెజారిటీ లేకపోయినా పోటీ చేసేందుకు ఇండియా కూటమి సిద్ధం అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.









