Janasena News Latest | ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి పొత్తులో మొట్టమొదట రాజీపడింది తానే అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ నాగబాబు.
టీడీపీ, జనసేన, బీజేపీ కనీసం 15 ఏళ్ళు కలిసి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవుల పంపకంపై మాట్లాడుతున్న వారి కుట్రలను తిప్పి కొట్టాలని నాగబాబు తెలిపారు. వైసీపీ లిక్కర్ నుంచి ల్యాండ్ వరకూ అన్నింటినీ అవినీతి మాయం చేసిందని విమర్శలు గుప్పించారు.
జనసేన వీర మహిళలు ప్రతీ ఒక్కరికీ తోబుట్టువుల్లా తోడుంటామని నాగబాబు భరోసానిచ్చారు. మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేసిన పరిస్థితుల నుంచి నేడు విద్య, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలే ముందుండే స్థాయికి ఎదిగారని, ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకంగా మారనున్నదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన వీర మహిళలతో నాగబాబు సమావేశం అయ్యారు.









