Maharashtra Agriculture Minister Manikrao Kokate Removed After Rummy Row, Gets Sports | మహారాష్ట్రలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. ఇటీవల రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగాయి.
సభ జరుగుతున్న సమయంలో మంత్రి మాణిక్ రావ్ కోకాటే రమ్మీ ఆడుతున్నట్లు ఒక వీడియో బయటకు వచ్చింది. దీనిని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రైతుల సమస్యల గురించి చర్చించకుండా రమ్మీ ఆడుతున్న మాణిక్ రావ్ కొకాటే రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక ప్రకటన వెలువడింది. ఇందులో అసెంబ్లీలో రమ్మీ ఆడారు అని ఆరోపణలు ఎదురుకుంటున్న మాణిక్ రావ్ కోకాటేకు క్రీడా మరియు యువజన సంక్షేమ శాఖలు కేటాయించడం సంచలనంగా మారింది. ఇక వ్యవసాయ శాఖను ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణేకు అప్పగించారు.









