Supreme Court Directs Telangana Speaker To Decide On Disqualification Of BRS MLAs Who Defected To INC Within 3 Months | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆరెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఈ పిటిషన్ పై రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే ఒక చట్టం తీసుకురావాలని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.
బీఆరెస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించాలని అలాగే తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆరెస్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెలువరించింది.









