Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ప్రమాణం

Ashok Gajapathi Raju takes oath as Goa Governor | గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు పూసపాటి అశోక్ గజపతిరాజు. శనివారం ఉదయం గోవా రాజ్ భవన్ బంగ్లా దర్బార్ హాల్ లో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.

గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆ రాష్ట్ర మంత్రివర్గ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. అశోక్ గజపతిరాజుకు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ పదవి చేపట్టినా హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే అశోక్ గజపతి రాజు, ఈ నూతన బాధ్యతలను కూడా అంతే అంకితభావంతో, నిష్పక్షపాతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions