CM Chandrababu unveils Green Hydrogen Valley declaration | గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ-అమరావతి డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విడుదల చేశారు.
ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ విజయానంద్, నెడ్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు కూడా ఉన్నారు. అమరావతిలో రెండు రోజుల పాటు 600 మంది ప్రతినిధుల తో గ్రీన్ హైడ్రోజన్‌పై సదస్సు జరిగిన విషయం తెల్సిందే.
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు కల్పించాలని, 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చేందుకు అవసరమైన కార్యాచరణ ప్రకటిస్తూ డిక్లరేషన్ రూపొందించారు.









