Telangana refuses to discuss ‘Banakacherla’ project at Revanth-Naidu meeting | ఢిల్లీ వేదికగా కేంద్రమంత్రి సమక్షంలో బుధవారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పై చర్చగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ కావాల్సి ఉంది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ సింగిల్ అజెండా ఇచ్చింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని గుర్తుచేసింది.
ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.









