Konijeti Rosaiah Statue | ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) జయంతి సందర్బంగా కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లోని లక్డీకాపుల్ లో ఏర్పాటు చేసిన రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ సీఎం, ఆర్థిక మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ నేతగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
కాగా, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య 14 నెలలపాటు సీఎంగా సేవలు అందించారు.
అనంతరం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. అనారోగ్యం కారణంగా 2021 డిసెంబర్ 4న రోశయ్య కన్నుమూశారు.









