KCR Health Bulletin | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం సాయంత్రం అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. యశోదా ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నీరసం కారణంగా ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు వైద్యులు తెలిపారు.
ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కేసీఆర్ రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయులు అధికంగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు.
అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.










