Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ రోజు ఆయుర్వేద దినోత్సవం..ప్రత్యేకత ఏంటో తెలుసా!

ఆ రోజు ఆయుర్వేద దినోత్సవం..ప్రత్యేకత ఏంటో తెలుసా!

Ayurveda Day to be celebrated on September 23 every year | ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆయుర్వేదాన్ని శాస్త్రీయ మరియు సంపూర్ణ వైద్య విధానంగా ప్రచారం చేయడానికి అలాగే ఆరోగ్య సంరక్షణ, సుస్థిరతలో కీలక పాత్రను గుర్తుచేయడానికి ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవాలని కేంద్రం పేర్కొంది.

ఈ ప్రకటన కంటే ముందు ఆయుర్వేద దినోత్సవాన్ని దంతేరాస్ పండుగ రోజు జరిపేవారు. అయితే, దంతేరాస్ పండుగ వేర్వేరు తేదీల్లో వస్తుండడంతో ఆయుర్వేద దినోత్సవానికి ఒక స్థిరమైన తేదీ లేకుండా పోయింది. దింతో ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు నిర్వహించడం కష్టంగా ఉండేది.

ఈ నేపథ్యంలో ఈ అనిశ్చితి ని తొలగించి, సెప్టెంబర్ 23వ తేదీన ఆయుర్వేద దినోత్సవంగా నిర్ణయిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 23వ తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజును ‘ఈక్వినాక్స్’ అని పిలుస్తారు. అంటే ఈ రోజున భూమిపై పగలు రాత్రి సమయం దాదాపు సమానంగా ఉంటుంది.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions