Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’

‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’

Ayyanna Patrudu News Latest | పాకిస్థాన్ కుట్రలను భారత సైన్యం వీరోచితంగా భగ్నం చేస్తుంది. ఈ తరుణంలో భారత సైన్యానికి యావత్ దేశం మద్దతు ప్రకటించింది.

అలాగే దేశ రక్షణ నిధికి విరాళాలు కూడా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు దేశ రక్షణ నిధి కోసం విరాళం ఇచ్చారు. పాక్ లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల ఏరివేతకు ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా త్రివిధ దళాలు ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెల్సిందే.

అనంతరం భారత పౌరులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడుతోంది. అయితే పాక్ దాడులను భారత్ తిప్పికొడుతుంది. ఏ మాత్రం సంయవనం కోల్పోకుండా భారత సైన్యం పాక్ కు ధీటుగా బదులిస్తోంది. ఈ నేపథ్యంలో దేశ రక్షణ, పౌరుల భద్రత కోసం కట్టుబడి ఉన్న సైన్యం కోసం అయ్యన్నపాత్రుడు తన ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.

రూ.217000 లను దేశ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్రవాద నిర్మూలనలో సాయుధ దళాల ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు సంఘీభావంగా,తాను తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. దేశభక్తి గల ప్రతీ పౌరుడు ఈ సేవాకార్యంలో భాగస్వామి కావాలని కోరారు.

You may also like
‘నిధి అగర్వాల్ ను చూసి నాకే బాధ, సిగ్గనిపించింది’
గోడకు రంధ్రం చేసి..18 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
భార్య పాదాలకు నమస్కరించే నిద్రపోతా..రేసుగుర్రం నటుడు ఎమోషనల్
విద్యార్థిని ఘోరంగా కొట్టిన టీచర్..ఆరు నెలల జైలు, రూ.లక్ష ఫైన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions