China Building World’s Highest Bridge | చైనా మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా రికార్డు సృష్టించనున్న బ్రిడ్జికి చైనా కోసమెరుపులు దిద్దుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 100 వంతెనల్లో సగానికి పైగా చైనా లోనే ఉన్నాయి.
తాజగా హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్, చైనా గుయ్‌జౌ ప్రావిన్స్ లోని బీపన్ నదిపై నిర్మిస్తున్నారు. ఈ వంతెన సముద్ర మట్టానికి 2,050 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనల జాబితాలో చోటు సంపాదించింది. ఈఫిల్ టవర్ కంటే సుమారు 200 మీటర్లు ఎత్తు, మూడు రెట్లు బరువుతో సుమారు 2,890 మీటర్లు పొడవుతో దీని రూపకల్పన జరిగింది.
ఈ బ్రిడ్జి హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ ప్రాంతంలోని రెండు భారీ కొండల మధ్య నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.2,400 కోట్ల రూపాయల అయినట్లు అంచనా. నిర్మాణ పనులు 2022లో ప్రారంభమై, 2025 జూన్‌లో ఈ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ బ్రిడ్జి నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత మరియు భారీ యంత్రాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ బ్రిడ్జి భారీ భూకంపాలు, బలమైన గాలులు వంటి సహజ విపత్తులను తట్టుకునేలా రూపొందించబడింది. గుయ్‌జౌ ప్రాంతంలోని రెండు దూరప్రాంతాలను అనుసంధానించడం ద్వారా రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గించాలానే లక్ష్యంతో దీన్ని నిర్మించారు.
గతంలో, ఈ లోయ దాటడానికి 70 నిమిషాల సమయం పట్టేది, కానీ ఈ బ్రిడ్జి ద్వారా ఈ ప్రయాణం కేవలం 1-2 నిమిషాల సమయం పట్టనుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.









