Sydney Sixers Pranks With Virat Kohli Fans | విరాట్ కోహ్లీ అభిమానులకు ఊహించని షాకిచ్చింది సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ. బిగ్ బాస్ లీగ్ లో భాగంగా విరాట్ కోహ్లీ రాబోయే రెండు సీజన్లకు గాను సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతాడాని ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
ఇది చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించే వరకు భారత ఆటగాళ్లు విదేశీ లీగుల్లో పాల్గొనరదు. టీ-20 లకు కోహ్లీ వీడ్కోలు పలికినా, వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు.
ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనలు ఉన్నా కోహ్లీ సిడ్నీ సిక్సర్స్ తరఫున ఎలా ఆడబోటున్నారు అని తలలుపట్టుకున్నారు. ఈ నేపథ్యంలో చావు కబురు చల్లగా చెప్పినట్లు, సిడ్నీ సిక్సర్స్ అసలు విషయాన్ని ఆలస్యంగా ప్రకటించింది. ఇది ఏప్రిల్ 1 కాబట్టి ఏప్రిల్ ఫూల్స్ అని సిడ్నీ సిక్సర్స్ మరో పోస్ట్ చేసింది.
ఇది చూసిన అభిమానులు తొలుత ఆగ్రహం వ్యక్తం చేసినా, అనంతరం తాము ఫూల్స్ అయ్యామని గమనించి నవ్వుకున్నారు.