Wednesday 23rd July 2025
12:07:03 PM
Home > తాజా > ‘Ghibli-Style AI Art..ఇకనుండి ఫ్రీగానే’

‘Ghibli-Style AI Art..ఇకనుండి ఫ్రీగానే’

ChatGPT finally allows free users to create Ghibli-style AI images | గత కొన్ని రోజులుగా చాట్ జీపీటీలో జీబ్లీ ఫోటోలు యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. తమకు నచ్చిన ఫోటోలను చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి జీబ్లీ స్టైల్ లో మార్చుకునేందుకు యూజర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ కీలక ప్రకటన చేశారు. చాట్ జీపీటీలో జీబ్లీ ఆర్ట్ ఫీచర్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చని శుభవార్త చెప్పారు. ఈ ఫీచర్ కు వరల్డ్ వైడ్ గా విశేష ఆదరణ వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

జీబ్లీ ఆర్ట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన కేవలం ఒక గంట వ్యవధిలోనే సుమారు 10లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీలో సైన్ అప్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు చాట్ జీపీటీ ప్లస్, ప్రో, టీం ప్లాన్స్ యూజర్లు, పెయిడ్ సబ్ స్క్రైబర్లు మాత్రమే జీబ్లీ ఆర్ట్ ఫీచర్ పరిమితి లేకుండా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు.

ఫ్రీ యూజర్లకూ అందుబాటులో ఉన్నా కేవలం రోజుకు మూడు ఫోటోలను మాత్రమే జనరేట్ చేసే అవకాశం ఉంది. కానీ తాజాగా ఓపెన్ ఏఐ సీఈఓ తీసుకున్న నిర్ణయంతో ఇక ఈ ఫీచర్ ను యూజర్లు ఉచితంగా, పరిమితులు లేకుండా వాడుకునే అవకాశాన్ని కల్పించారు.

You may also like
‘తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి చేయాలి’
పవన్ సినిమాకు అంబటి రాంబాబు ఆల్ ది బెస్ట్
పెద్దిరెడ్డిని కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
కేబీకే గ్రూప్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions