Group-2 Mains Exam In Andhra Pradesh | గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుండి 5.30 వరకు పేపర్ – 2 పరీక్ష జరగనుంది.
మొత్తం 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. మొత్తం 175 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సి ( APPSC ) కి శనివారం లేఖను రాసింది.
కానీ పరీక్షను యథాతథం గా నిర్వహించడానికే కమిషన్ మొగ్గు చూపింది. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారని, వాయిదా వేస్తే అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని కమిషన్ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖను రాశారు.
అంతేకాకుండా శాసనమండలి ఎన్నికలను నిర్వహించే కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే ఏపీపీఎస్సి ఉన్న విషయాన్ని లేఖలో గుర్తుచేశారు.









