Ys Jagan To Attend Assembly Sessions | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సోమవారం నుండి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Syed Abdul Nazeer ) ప్రసంగించనున్నారు. అనంతరం జరిగే బీఏసీ ( BAC ) సమావేశంలో సభ ఎన్ని రోజులు నడపాలనే నిర్ణయం తీసుకుంటారు.
ఈ క్రమంలో సోమవారం గవర్నర్ ప్రసంగానికి హాజరవ్వాలని జగన్ భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అధినేత నిర్ణయం మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సభకు రానున్నారు.
అయితే మంగళవారం నుండి జరిగే సమావేశాలకు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.









