Trump-Melania Miss Kiss | అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుక రాజధాని వాషింగ్టన్ ( Washington DC ) లోని క్యాపిటల్ ( Capitol Hill ) భవనంలో జరిగింది.
ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ప్రమాణం చేసేందుకు వెళ్తూ భార్య మెలానియా ( Melania )వద్దకు ట్రంప్ వచ్చారు.
ఆప్యాయంగా ఆమెను ముద్దాడేందుకు ప్రయత్నించారు. అయితే మెలానియా తలపై ధరించిన టోపి వారికి అడ్డొచ్చింది. ఈ క్రమంలో వారు కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ సన్నివేశం అక్కడి వారి పెదవులపై నవ్వును విరబూసేలా చేసింది.
అనంతరం ట్రంప్ దంపతులు మరియు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ( JD Vance ) దంపతులు డాన్స్ చేసి అలరించారు. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణం చేశారు.
ఈ క్రమంలో ఆయన సతీమణి అమెరికా సెకండ్ లేడీ ( Second Lady ) ఉష చిలుకూరు భర్తవైపు గర్వంగా చూస్తున్న వీడియోలు తెగ వైరల్ గా మారాయి. కాగా ఉష చిలుకూరు అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి.