Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > డిప్యూటీ సీఎంగా నారా లోకేష్..టీడీపీ కీలక ఆదేశాలు

డిప్యూటీ సీఎంగా నారా లోకేష్..టీడీపీ కీలక ఆదేశాలు

TDP High Command Reacts to Deputy CM Demands for Nara Lokesh | రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ( Deputy Cm )గా పదోన్నతి ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్లు వినిపిస్తున్నారు.

నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేస్తే టీడీపీకి మంచి భవిష్యత్ ఉండడమే కాకుండా, యువతకు భరోసా ఉంటుందని పలువురు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని నేతలకు అధిష్టానం స్పష్టం చేసింది.

మీడియా వద్ద ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయిద్దని టీడీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏ నిర్ణయమైన కూటమి నేతలు కూర్చుని మాట్లాడుకుంటారని పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని సూచించింది.

కాగా జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా మైదుకూరులో నిర్వహించిన సభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu )ను సభావేదిక నుండే కోరారు.

అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలను సమర్ధించారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions