Tirumala Temple News | నవంబర్ నెలలో శ్రీవారిని 20.37 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ ( TTD ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ( B R Naidu ) వెల్లడించారు.
భక్తుల కానుకలు ద్వారా రూ. 113 కోట్లు శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే 97 లక్షల లడ్డూలు విక్రయించినట్లు చెప్పారు. 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారని మరియు 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.
మరోవైపు కియోస్క్ మిషన్లతో సులభతరంగా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్ కియోస్క్ మిషన్లను టీటీడీ ఏర్పాటు చేసింది.
ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం వచ్చినట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం ఉందన్నారు.









