Fake Parcels Scam | మీకు ఓ పార్సిల్ (Parcel) వచ్చిందంటూ ఓ ప్రముఖ కంపెనీ నుండి ఫోన్ వస్తుంది. కాసేపటికే మీ పార్సిల్ లో డ్రగ్స్ పట్టుబడ్డాయంటూ బెదిరిస్తారు. ఇలాంటి ఘటనలు ఇటీవలే అధికంగా పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ప్రజలను తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. కస్టమ్స్ అధికారుల్లా క్రిమినల్ ముఠా బెదిరించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాకుండా కేసులు, సెక్షన్లు అంటూ తికమక పెట్టి డబ్బులు వసూలు చేస్తారని పోలీసులు హెచ్చరించారు. కానీ ఇలాంటి సమయంలో కంగారు పడకుండా 1930 అనే నంబర్ కు ఫోన్ చేయాలని తెలంగాణ పోలీసు విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.