Telangana High Court On MLA’s Defamation Case | ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) కీలక తీర్పును వెలువరించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ( Assembly Speaker ) కు సూచించింది.
కాగా బీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ( Danam Nagender ), తెల్లం వెంకట్రావ్ మరియు కడియం శ్రీహరి ( Kadiyam Srihari )పై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ లు పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ క్రమంలో నాలుగు వారాల్లో అనర్హత పిటిషన్ లపై షెడ్యూల్ ఖరారు చేయాలని సింగిల్ జడ్జ్ తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు.
తాజగా విచారణ చేపట్టిన న్యాయస్థానం, సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పేటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.