Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > కంగారూలనే కంగారు పెట్టించిన బూమ్ బూమ్ బుమ్రా

కంగారూలనే కంగారు పెట్టించిన బూమ్ బూమ్ బుమ్రా

AUS vs IND First Test | బోర్డర్-గవాస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీలో భాగంగా పెర్త్ ( Perth ) వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలయ్యింది. తొలిరోజు ఇరుజట్ల బౌలర్లు చెలరేగిపోయారు.

టాస్ గెలిచి కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా ( Jasprit Bumrah ) బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో కంగారూల బౌలింగ్ ధాటికి టీం ఇండియా ( Team India ) కుప్పకూలింది. కేవలం 150 పరుగుల వద్దే ఆల్ ఔట్ ( All Out ) అయ్యింది. ఫస్ట్ టెస్టులోనే నితీష్ రెడ్డి రాణించాడు. 41 పరుగులతో టీం ఇండియాను కాపాడాడు.

పంత్, రాహుల్ మినహా ఎవరూ రాణించలేదు. మరోవైపు ఆసీస్ బౌలర్ హాజల్ వుడ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కంగారూలను బెంబేలెత్తించాడు బుమ్రా.

నిమిషాల వ్యవధిలోనే తొలి మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. దింతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. బుమ్రా నాలుగు, సిరాజ్ 2, హర్షిత్ రాణా ఒకటేసి వికెట్లు తీశారు

You may also like
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి
కేసీఆర్ ఇంటి గోడకు సిట్ నోటీసులు..కేటీఆర్ కన్నెర్ర
బంగారం, వెండి ధరలు పతనానికి కారణం ఈయనే!
రష్యన్ అమ్మాయిలతో సెక్స్..బిల్ గేట్స్ కు రోగం?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions