PM Vishwakarma Yojana | కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా 18 రకాల సంప్రదాయ చేతి వృత్తిదారులకు ఆర్థిక సాయం అందిస్తోంది. మొదట వారి వృత్తి సంబంధిత పనిముట్ల కొనుగోలుకు రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది.
పనుల్లో నైపుణ్యం పెంచుకునేందుకు తగిన శిక్షణ ఇచ్చి, రోజుకు రూ. 500 చొప్పున స్టైఫండ్ అందిస్తుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం 5 శాతం వడ్డీతో రూ. లక్ష బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. దీనిని 18 నెలల్లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తొలి విడత లోన్ సద్వినియోగం చేసుకున్న వారికి తర్వాత మరో రూ. 2 లక్షల వరకు లోన్ వస్తుంది. దీనిని తిరిగి చెల్లించేందుకు 30 నెలల సమయం ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఐడీ కార్డుతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ pmvishwakarma.gov.in ను సందర్శించవచ్చు.
చేనేత కార్మికులు, రజకులు, స్వర్ణకారులు, వడ్రంగులు, తాపీ పని చేసేవారు, దర్జీలు, కమ్మరి, కుమ్మరి సహా ఇతర సంప్రదాయ వృత్తిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు.