Pakistan Spying On Chenab Bridge | జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లోని రైసీ, రామబాన్ జిల్లాల మధ్య చినాబ్ ( Chenab )నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వేవంతెనపై పాకిస్తాన్ ( Pakistan ) కన్నేసినట్లు తెలుస్తోంది.
సుమారు 20 ఏళ్ల వ్యవధిలో నిర్మించిన చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. ఇప్పటికే ఈ బ్రిడ్జి పై తొలి రైలు ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఈ వంతెనకు సంబంధించిన వివరాలను చైనా కోరడంతోనే పాకిస్తాన్ దేశ ఇంటిలిజెన్స్ వర్గాలు రైల్వే బ్రిడ్జి గురించి అత్యంత కీలకమైన వివరాలను సేకరిస్తున్నట్టుకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
చినాబ్ రైల్వే వంతెన కంటే ముందువరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుభాయ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఉండేది. ఇదిలా ఉండగా చినాబ్ నదిపై రైల్వే బ్రిడ్జి వివరాలను చైనా ఎందుకు సేకరించమని పాకిస్తాన్ ను పురమాయించిందో అనేది తెలియాల్సి ఉంది.