Monday 28th April 2025
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ భాయ్ ఆర్సీబీ లోకి వచ్చేయ్

రోహిత్ భాయ్ ఆర్సీబీ లోకి వచ్చేయ్

Fan Requests Rohit Sharma To Join RCB | మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ( IPL 2025 ) మెగా ఆక్షన్ ( Mega Auction )జరగనుంది. ఈ క్రమంలో జట్లు ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది.

మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ( Hitman Rohit Sharma ) ఐపీఎల్ కెరీర్ పై ఉత్కంఠ నెలకొంది. గత ఐపీఎల్ లో భాగంగా రోహిత్ ను కాదని ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) యాజమాన్యం హార్దిక్ పాండ్య ( Hardik Pandya )ను కెప్టెన్ చేసిన విషయం తెల్సిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడుతారు అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఐదు సార్లు ముంబైకి ఐపీఎల్ ట్రోఫీని సాధించి పెట్టిన రోహిత్ ను దక్కించుకునేందుకు ప్రతీ టీం ప్రయత్నిస్తోంది.

ఒకవేళ రోహిత్ ఆక్షన్ లోకి వస్తే భారీ మొత్తాన్ని దక్కించుకోవడం ఖాయం అని మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ ఫ్యాన్ కు మరియు రోహిత్ కు మధ్య ఐపీఎల్ విషయంలో జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. ఇండియా న్యూజీలాండ్ మధ్య బెంగుళూరులో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే.

ఈ సందర్భంగా ఓ అభిమాని ఐపీఎల్ లో ఏ టీం కు వెళ్లనున్నారు అంటూ రోహిత్ ను అడిగారు. దీనికి నీకు ఏ టీం కావాలి ? అని హిట్ మ్యాన్ తిరిగి ప్రశ్నించారు. రోహిత్ భాయ్ ఆర్సీబీ ( RCB )కి వచ్చేయండి అంటూ సదరు అభిమాని కోరారు. అనంతరం చేయి ఊపుతూ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్ ( Dressing Room ) లోకి వెళ్లిపోయారు.

You may also like
భారత్ – పాక్ ఉద్రిక్తతలపై అమెరికా కీలక సూచన!
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions