Friday 30th January 2026
12:07:03 PM
Home > Uncategorized > హీరోయిన్ రష్మికకు కొత్త బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!

హీరోయిన్ రష్మికకు కొత్త బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!

rashmika mandanna

Rashmika Mandanna | టాలీవుడ్ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) కు భారత ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. రష్మికను కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి అంబాసిడర్‌గా నియమించింది. ఈ మేరకు రష్మిక సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు.

‘హలో నేను రష్మిక మందన్న. కొన్ని నెలల కిందట నా డీప్ ఫేక్ వీడియోని ఒకటి క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అది సైబర్ నేరం.

అప్పుడు ఈ సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను.

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. ఆ ఐ4సీ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

సైబర్ నేరగాళ్లు ఎటు నుంచి ఎలా దాడి చేస్తారో చెప్పలేం.. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ కలిసి కట్టుగా పోరాడి.. దేశాన్ని సైబర్ నేర రహిత భారత్‌ గా తీర్చిదిద్దాం అంటూ రష్మిక చెప్పుకొచ్చారు.

You may also like
Digital Arrest
డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.32 కోట్లు కోల్పోయిన మహిళ!
అత్యంత సన్నిహితులు సమక్షంలో విజయ్-రష్మిక ఎంగేజ్మెంట్
pib fact check
మీ ఫోన్ కి ఈ మెసెజ్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త: పీఐబీ
nimisha priya
యెమెన్ లో కేరళ నర్సు ఉరిశిక్షపై కేంద్రం కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions