Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి..ప్రభుత్వం చెప్పాలి : హరీష్ రావు

ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి..ప్రభుత్వం చెప్పాలి : హరీష్ రావు

Harish Rao On Patnam Mahender Reddy | బీఆరెస్ నేత హరీష్ రావు ( Harish Rao ) కీలక వ్యాఖ్యలు చేశారు. చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి ( Patnam Mahender Reddy ) నియామకం రాజ్యాంగ విరుద్ధం, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నదని హరీష్ రావు విమర్శించారు.

బీఆరెస్ కు చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయనపై ఛైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటీషన్ పెండింగ్ లో ఉందన్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ చీఫ్ విప్‌గా అదే కౌన్సిల్ చైర్మన్ బులిటెన్ ఎలా ఇష్యూ చేస్తారని నిలదీశారు.

పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించిందని మండిపడ్డారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడని, దీని ద్వారా పార్టీ ఫిరాయింపు చేశాడని స్పష్టంగా అర్థమవుతుందని హరీష్ పేర్కొన్నారు. అసలు పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions