Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘కౌన్ బనేగా కరోడ్పతి’ లో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న

‘కౌన్ బనేగా కరోడ్పతి’ లో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న

pawan kalyan

Question About Pawan Kalyan In ‘ Koun Banega Crorepati ‘ | టాలీవుడ్ ( Tollywood ) లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అలాగే ప్రధాని మోదీ ( PM Modi ) కూడా ఈయన పవన్ కాదు, తుఫాన్ అని కొనియాడారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ( Koun Banega Crorepati ) షోలో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న అడిగారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 16వ సీజన్ నడుస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ( Amitab Bachchan ) ఈ షోకు హోస్ట్ ( Host )గా వ్యవహరిస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్ ( Episode ) లో ‘ 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన నటుడు ఎవరు ?’ అని కంటెస్టెంట్ ను అమితాబ్ ప్రశ్న అడిగారు.

దింతో సదరు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ కు వెళ్లారు. ఇందులో సుమారు 50 శాతంపైగా పవన్ కళ్యాణ్ పేరును చెప్పారు. సమాధానంగా కంటెస్టెంట్ పవన్ పేరును లాక్ చేయడంతో ఆయన రూ.1.6 లక్షలు గెలిచారు.

You may also like
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్
మీ కష్టంలో తోడుంటా..పవన్ భరోసా
జూదం, పందెం భోగి మంటల్లో కలాలి..సంప్రదాయం వెలగాలి
జనసేనకు నాగబాబు సన్నిహితుల భారీ విరాళం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions