Hydra Commissioner On Demolition Policy | చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ ( FTL ), బఫర్ జోన్ల ( Buffer Zone )లో ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా ( Hydra )కొరడా ఝులిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నివాసం కోసం ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ( Commissioner Ranganath ) స్పష్టం చేశారు.
నిర్మాణంలో ఉన్న, నూతన నిర్మాణాలపై మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. అలాగే మల్లంపేట చెరువులో ఆదివారం కేవలం నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్రమే కూల్చివేసినట్లు తెలిపారు.
మరోవైపు సున్నం చెరువులో కూడా వాణిజ్య పరమైన షెడ్లను కూల్చివేస్తున్నట్లు, గతంలో కూడా వీటిని కూల్చివేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి బిల్డర్ విజయలక్ష్మీ పై క్రిమినల్ కేసును నమోదు చేసినట్లు రంగనాథ్ పేర్కొన్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లను, స్థలాలను ఎవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు.