Thursday 19th September 2024
12:07:03 PM
Home > తాజా > విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి.. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్!

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి.. ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్!

ktr pressmeet

KTR Slams TG Govt | విద్యార్థుల స్కాలర్ షిప్ లకు సంబంధించి ప్రభుత్వం ప్రశ్నలు కురిపించారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్ధులంటే.. ఈ కాంగ్రెస్ సర్కారుకు ఎందుకింత చిన్నచూపు అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా… బోధనా ఫీజులు, ఉపకార వేతనాల జాడేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

“రూ. 5900 కోట్లకు బకాయిలు చేరుకున్నా… ప్రభుత్వంలో చలనం లేదు.. దరఖాస్తులకే దిక్కులేదు.. స్కాలర్ షిప్పులను పెండింగ్ లో పెట్టడంతో.. రోజురోజుకూ పెరుగుతున్న విద్యార్థుల అవస్థలు.. విద్యాసంస్థల యాజమాన్యాలకు తప్పని తిప్పలు.. 

మెయింటెనెన్స్ చార్జీలు కూడా రాకపోవడంతో చదువుకు దూరమవుతున్న వసతిగృహాల విద్యార్థులు.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్ల.. పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలు… ఇకనైనా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆగాలి.. ప్రభుత్వం వెంటనే బకాయిలన్నీ విడుదల చేయాలి”. అని డిమాండ్ చేశారు కేటీఆర్.

You may also like
Kumari Aunty meets cm revanth
సీఎం సహాయ నిధికి కుమారి ఆంటీ విరాళం.. ఎంతంటే!
ktr
తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి: కేటీఆర్
సీఎం రేవంత్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
cm revanth reddy
IIHTకి ఆయన పేరు పెడతాం: సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions