Friday 22nd November 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > దేశ సమగ్రత కాపాడటం మనందరి కర్తవ్యం: సీఎం చంద్రబాబు

దేశ సమగ్రత కాపాడటం మనందరి కర్తవ్యం: సీఎం చంద్రబాబు

chandra babu

CM Chandra Babu | భారత స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పిలుపుమేరకు సీఎం చంద్రబాబు హార్ ఘర్ తీరంగా (Har Ghar Tiranga) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం అని గుర్తుచేశారు.

ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయమని చంద్రబాబు పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు వాడైన పింగళి వెంకయ్య రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకం, గర్వకారణం అన్నారు.

ప్రతి ఇంటి పై, ప్రతి కార్యాలయం పై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించండి అని సీఎం పిలుపునిచ్చారు. అలాగే జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవలన్నారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని, స్ఫూర్తిని నింపుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

You may also like
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం పవన్ సార్
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
Police save old age woman
హాట్సాఫ్ పోలీస్.. బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన పోలీస్!
సమయం కావాలి..వాట్సప్ లో పోలీసులకు ఆర్జీవి మెసేజ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions