Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్

పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్

ktr

KTR Post on Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం నిమిత్తం మంగళవారం రాత్రి తెలంగాణకు రానున్నారు. వరంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కాగా మోదీ పర్యటన నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు.

” పిరమైన ప్రధాని నరేంద్రమోదీ గారు, దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!! ప్రధానిగా పదేళ్లు గడిచినా..

తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!! మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్  ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి..!! దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి..!

కానీ.. దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి..!! రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు..! ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ..!!” అని కేటీఆర్ కీలక సూచనలు చేశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions