Hyderabad Metro Expansion | శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) వరకు మెట్రో రైలు విస్తరణ మరియు ఫార్మా సిటీ (Pharma City)కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. సోమవారం నాడు మీడియాతో సీఎం చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రో మరియు ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని, ప్రజా ప్రయోజనాల మేరకు స్ట్రీమ్ లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాల కంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే మెట్రో దూరం తగ్గించనున్నట్లు తెలిపారు.
MGBS నుండి ఓల్డ్ సిటీ మీదుగా అలాగే నాగోల్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పొడిగించనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్పోర్ట్ కు మెట్రో లైన్ లింక్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్ మధ్య జీరో పొల్యూషన్ తో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కుతాయని తేల్చిచెప్పారు సీఎం రేవంత్.